పక్కా కమర్షియల్‌తో ఎంటర్‌టైన్మెంట్ పక్కా..

by Disha Web Desk 2 |
పక్కా కమర్షియల్‌తో ఎంటర్‌టైన్మెంట్ పక్కా..
X

దిశ, సినిమా : 'పక్కా కమర్షియల్' సినిమా పక్కా ఎంటర్‌టైన్మెంట్ ఇస్తుందన్నారు దర్శక, నిర్మాతలు మారుతి, బన్నీ వాసు. జులై 1న విడుదల కానున్న సినిమా టికెట్ రేట్లు కూడా అందుబాటు ధరలో ఉన్నాయని, ప్రేక్షకులు తప్పకుండా సినిమా చూడాలని కోరారు. మెగాస్టార్ చిరంజీవి ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రావడంతో రీచ్ ఎక్కువైందన్న మేకర్స్.. ఫైట్స్, సాంగ్స్ అన్నీ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ సెట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. దాసరి, ఈవీవీ లాంటి మహానుభావులు చిన్న సినిమాను కాపాడుతూ వచ్చారని, వారిని ఆదర్శంగా తీసుకుని పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు చేస్తానని చెప్పకొచ్చాడు మారుతి. యూవీ, జీఎ2 సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన మూవీ హండ్రెడ్ పర్సెంట్ నవ్వులు పూయిస్తుందన్నాడు.

Next Story

Most Viewed