ప్రియునితో జంప్ అయ్యేందుకు వివాహిత బిగ్ స్కెచ్.. లాస్టులో సీన్ రివర్స్

by Muthe.Rajitha |

కర్ణాటకలో ఓ వివాహిత ప్రియునితో పారిపోయేందుకు కిడ్నాప్ అయినట్టు డ్రామా ఆడటం సంచలనం రేపింది.

ప్రియునితో జంప్ అయ్యేందుకు వివాహిత బిగ్ స్కెచ్.. లాస్టులో సీన్ రివర్స్
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో జరిగిన ఒక సంఘటన సంచలనం సృష్టించింది. ఓ వివాహిత అనుమానాస్పందంగా అదృశ్యం కావడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు రేపింది. దీనిపై పోలీసులు విచారణ జరపగా బయటపడిన ట్విస్టు చూసి అంతా షాక్ కు గురయ్యారు. అనంతరం ఇదెక్కడి చోద్యం అంటూ తిట్టిపోశారు.

కిడ్నాప్?

ప్రియాంక అనే 29 ఏళ్ల వివాహిత తన ఊరి నుంచి చిక్కమగులూరులో జరుగుతున్న బంధువుల పెళ్లికి వెళ్లింది. పెళ్లి కార్యక్రమాలు ముగిసిన తర్వాత తిరిగి వెళ్తానని చెప్పిన ఆమె, చివరిసారిగా బేలూరు బస్టాండ్ సమీపంలోని సీసీ కెమెరాల్లో కనిపించింది. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆ తరువాత కొద్ది సేపటికే సమీపంలోని ఒక వాటర్ ట్యాంక్ వద్ద ఆమె హ్యాండ్ బ్యాగ్, చున్నీ, ఆధార్ కార్డు వంటి వ్యక్తిగత వస్తువులు కనిపించాయి. దీంతో ఆమె కిడ్నాప్‌కు గురైందా, లేక ఏదైనా దారుణానికి బలైందా అన్న అనుమానాలు చెలరేగాయి.ప్రజలు ఆందోళనకు దిగడంతో పరిస్థితి తీవ్రంగా మారడంతో కేసు పెద్దదిగా మారింది. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆమె భర్త, భార్యకు ఏదైనా అపాయం జరిగిందేమోనని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ట్విస్టు అదిరింది

ఉన్నతాధికారులు కూడా జోక్యం చేసుకోవడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజ్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె కదలికలను ట్రాక్ చేశారు. కొన్ని గంటల దర్యాప్తు ఫలితంగా ఆమె తన పాత స్నేహితుడు డేవిడ్ అనే వ్యక్తితో ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే.. అసలు నిజం బయటపడింది. నిజానికి ఆమెను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. తన ప్రియునితో వెళ్లిపోవడానికి తనే డ్రామా క్రియేట్ చేసింది. విలువైన బంగారం, డబ్బులు తీసుకొని.. ఎవ్వరికీ అనుమానం రాకుండా చెప్పులు, ఖాళీ బ్యాగ్ మాత్రం అక్కడ వదిలి వెళ్ళింది.

సీన్ రివర్స్

ఎవరో తనను కిడ్నాప్ చేసినట్టు సీన్ క్రియేట్ చేయాలని చూసింది. కానీ పోలీసుల ఎంట్రీతో రాసుకున్న మారిపోయి, జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇక భార్య మరొకరితో వెళ్ళిపోయిందనే విషయం తెలిసి ఆమె భర్త మరోసారి లబోదిబోమన్నాడు. ముందు వివాహితకు ఎదో జరిగిందని కంగారు పడిన వాళ్లంతా ఆమె బతికే ఉందని తెలిసి ఆశ్చర్యపోయారు, ఆమె ఆడిన నాటకానికి తిట్టిపోశారు.

Next Story