- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదని.. మనస్తాపంతో వివాహిత బలవన్మరణం
క్షణికావేశంలో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని వల్లాపురం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, నడిగూడెం: క్షణికావేశంలో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని వల్లాపురం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నడిగూడెం ఎస్సై జి.అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన స్వాతికి రెండేళ్ల క్రితం వల్లాపురం గ్రామానికి చెందిన సారగండ్ల కోటేశ్వరరావుతో వివాహం జరిగింది. వీరికి 11 నెలల కుమార్తె తేజస్విని ఉంది. జెసిబి ఆపరేటర్ గా పనిచేస్తున్న కోటేశ్వరరావుకు భార్య స్వాతి ఫోన్ చేసిన సమయంలో ఆయన సమాధానం ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన స్వాతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాత్రి 8:30 గంటలకు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
అప్పుడే బయటి నుంచి వచ్చిన భర్త కోటేశ్వరరావు గమనించి స్థానికుల సహకారంతో ఆమెను 108 అంబులెన్స్ ద్వారా ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ నెల 4న తెల్లవారుజామున స్వాతి(21) మృతి చెందింది. మృతురాలి తల్లి మామిడి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నడిగూడెం పోలీసులు.. మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనలో ఎవరిపైనా తమకు అనుమానాలు లేవని మృతురాలి తల్లి తెలిపినట్లు ఎస్సై వెల్లడించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.






