- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిల్డింగ్ పై నుంచి పడి వివాహిత మృతి
క్షణికావేశంలో ఓ వివాహిత బిల్డింగ్ పై నుండి దూకి మృతి చెందింది.

దిశ, భూదాన్ పోచంపల్లి : క్షణికావేశంలో ఓ వివాహిత బిల్డింగ్ పై నుండి దూకి మృతి చెందింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్‌కు చెందిన ఆనంద్ దేవి కుమావత్ (28), ఆమె భర్త మనీష్ కుమావత్ తో కలిసి పట్టణంలోని లక్ష్మణ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరు స్థానికంగా భవాని జ్యువెలర్స్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
సోమవారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆనంద్ దేవి ఫోన్ మాట్లాడుకుంటూ వరండాలోకి వచ్చి, తీవ్ర ఆవేశంతో రెండవ అంతస్తు నుంచి కిందకు దూకేసింది. ఇంట్లోనే ఉన్న భర్త మనీష్ హుటాహుటిన చికిత్స నిమిత్తం హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.






