Markapuram Bus Accident : గుండెలు పగిలే దృశ్యాలు.. మాంసపు ముద్దలుగా మార్కాపురం మృతులు

by Muthe.Rajitha |   (  Updated:2026-03-26 05:50:00  IST  )

మార్కాపురం బస్సు ప్రమాద మృతుల దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.

Markapuram Bus Accident  : గుండెలు పగిలే దృశ్యాలు.. మాంసపు ముద్దలుగా మార్కాపురం మృతులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని మార్కాపురం జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 13 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. మరో 28 మందికి గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాయవరం క్వారీ సమీపంలో ప్రయివేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొట్టగా.. బస్సుకు మంటలు అంటుకొని ప్రమాదం జరిగింది. కాగా ఘటనా స్థలంలోని ప్రమాద దృశ్యాలు గుండెలు పగిలేలా ఉన్నాయి. ప్రమాదస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మృతదేహాలను బస్సు నుంచి బయటకు తీయగా.. పూర్తిగా కాలిపోయిన మాంసపు ముద్దల వంటి డెడ్ బాడీలను చూసి రెస్క్యూ సిబ్బందితోసహా, స్థానికులు గగుర్పాటుకు గురయ్యారు. మృతుల వివరాలు సేకరించి, కుటుంబసభ్యుల DNA ఆధారంగా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ ప్రయాణికులను కాపాడకుండా పారిపోవడంతో.. బస్సు వెనుక భాగంలో ఉన్నవారు మంటల నుంచి తప్పించుకునే వీలు లేకుండా పోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే బస్సులోని ఓ యువతి ఎమెర్జెన్సీ నెంబర్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరూ ఎత్తలేదని ఆవేదన చెందింది. దాదాపు 20 సార్లు చేసాక రెస్పాండ్ అయ్యారని, రెస్క్యూ టీమ్ ఇంకాస్త త్వరగా వచ్చి ఉంటే ఒకరిద్దరు బతికేవారని కన్నీళ్లు పెట్టుకుంది.

Read More : మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా

Next Story