- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తలసాని.. పలువురు ప్రముఖులు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల క్షేత్రం ఇవాళ ప్రముఖుల రాకతో సందడిగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల క్షేత్రం ఇవాళ ప్రముఖుల రాకతో సందడిగా మారింది. ఇవాళ ఉదయం వీఐబీ బ్రేక్ దర్శనంలో తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav), తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Pedda REddy), హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav), సినీ నటుడు తనికెళ్ల భరణి (Tanikella Bharani) పలువురు దర్శించుకున్నారు. ఈ మేరకు దర్శనం పూర్తయిన వెంటనే వారికి రంగనాయకుల మండపంలో ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లుగా తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రశాంతత వెలకట్టలేనిదని, భక్తులందరికీ ఆ గోవిందుని కృపాకటాక్షాలు ఉండాలని నటుడు తనికెళ్ల భరణి ఆకాంక్షించారు.






