ముక్కు పుటలు బద్దలవుతున్నాయి..!

by Batti.Sumithra |

మణుగూరు పట్టణానికి ఎవరైనా రావాలంటే ముందు ముక్కు మూసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరికి మణుగూరు పట్టణం కంపు వాసనతో స్వాగతం పలుకుతోంది.

ముక్కు పుటలు బద్దలవుతున్నాయి..!
X

దిశ, మణుగూరు : మణుగూరు పట్టణానికి ఎవరైనా రావాలంటే ముందు ముక్కు మూసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరికి మణుగూరు పట్టణం కంపు వాసనతో స్వాగతం పలుకుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో మణుగూరు - ఏటూరి నాగారం ప్రధాన రహదారిలోని మణుగూరు కాట దాటిన తర్వాత మున్సిపాలిటీలోని చెత్తని ప్రధాన రహదారి పక్కనే మున్సిపాలిటీ వారు డమ్ చేస్తున్నారు. దీంతో మణుగూరు వచ్చి పోయే వారి ముక్కు పుట్టలు బద్దలైపోతున్నాయి. భరించలేని వాసనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మణుగూరు మున్సిపాలిటీకి సంబంధించి లక్షల వ్యయంతో అన్నారం గ్రామంలో డంపు యార్డును నిర్మించారు. లక్షలు వెచ్చించారే తప్ప ఆ డంపు యార్డును ఉపయోగించిన పాపాన పోలేదు.

దీనికి అధికారులు ఇచ్చే సమాధానం మున్సిపాలిటీ కార్యాలయం నుంచి అన్నారం డంప్ యార్డ్ చాలా దూరం ఉందని, ఇందుకు డీజిల్ ఎక్కువ ఖర్చవుతుంది అని సమాధానాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మున్సిపాలిటీలో సేకరించిన చెత్తని ప్రధాన రహదారి పక్కనే పోస్టు ఆ ప్రదేశాన్ని డంప్ యార్డ్ గా చేశారు. దీంతో మన ఊరు మీదిగా వెళ్లే ప్రయాణికులు, మణుగూరుకు వచ్చే ప్రయాణికులు తీవ్రఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రోడ్డు పక్కన వచ్చే కంపు వాసనతో వచ్చే ప్రయాణికులందరూ ముక్కులు మూసుకుంటున్నా. ఈ కంపు వాసనే కాదు ఈ వాసన వల్ల ప్రజలు రోగాల బారినపడే ప్రమాదాలు ఉన్నాయని పలువురు వాపోతున్నారు. పినపాక నియోజకవర్గం కేంద్ర బిందువు అయిన మణుగూరు పట్టణంలో చెత్తని డంప్ చేసేందుకు వేరే ప్రదేశమే లేదా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలు వెచ్చించి ఏర్పాటుచేసిన డంపింగ్ యార్డ్ ను వెంటనే ప్రారంభించాలని, ప్రధాన రహదారి పై ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ను తొలగించి ప్రజల ప్రాణాలకు కాపాడాలని పలువురు కోరుతున్నారు.

Next Story