- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ పేపర్ లీక్ కేసులో బిగ్ అప్‌డేట్.. ఎన్‌టీఏ ఎక్స్‌పర్ట్ మనీషాకు 14 రోజుల సీబీఐ కస్టడీ
నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో ఎన్‌టీఏ ఎక్స్‌పర్ట్ మనీషా మాంధరేకు రౌస్ ఎవెన్యూ కోర్టు 14 రోజుల సీబీఐ కస్టడీ విధించింది.

దిశ, వెబ్ డెస్క్: నీట్-యూజీ క్వశ్చన్ పేపర్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నీట్-యూజీ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లు తేలడంతో.. పరీక్షలను రద్దు చేసి.. దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐకి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా (మాస్టర్‌మైండ్) భావిస్తున్న నిందితురాలు మనీషా గురునాథ్ మాంధరేని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు (Rouse Avenue Court) 14 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర పూణేకు చెందిన మనీషా.. ఒక సీనియర్ బోటనీ (వృక్షశాస్త్రం) అధ్యాపకురాలు. ఈమెను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఒక నిపుణురాలిగా (Expert) నియమించడంతో, ఈమెకు నీట్ పరీక్షకు సంబంధించిన బోటనీ, జువాలజీ (బయాలజీ) ప్రశ్నపత్రాలపై పూర్తి యాక్సెస్ లభించింది.
ఆ అవకాశాన్ని వాడుకుని ఆమె పేపర్ లీక్ చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఎన్‌టీఏ (NTA) లోపల ప్రశ్నపత్రాల తయారీ నుండి పంపిణీ వరకు జరిగిన మొత్తం ప్రక్రియపై ప్రస్తుతం లోతైన దర్యాప్తు జరుగుతోందని సీబీఐ కోర్టుకు తెలిపింది. మనీషా మాంధరే లీకైన ప్రశ్నలను విద్యార్థులకు ముందుగానే చేరవేసి, అందుకు ప్రతిఫలంగా వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయని, దీని వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించాల్సి ఉందని సీబీఐ స్పష్టం చేసింది. ఏప్రిల్ నెలలోనే ఈమె తన పూణే నివాసంలో సీక్రెట్ కోచింగ్ క్లాసులు పెట్టి లీకైన ప్రశ్నలను నోట్బుక్స్‌లో రాయించినట్లు దర్యాప్తులో తేలినట్లు సీబీఐ కోర్టుకు స్పష్టం చేసింది.
అయితే సీబీఐ రిమాండ్ దరఖాస్తును నిందితురాలి తరపు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. నిందితురాలి ఇంట్లో జరిపిన తనిఖీల్లో ఎలాంటి లీకేజీ ఆధారాలు, అక్రమ నిధులు లభించలేదని కోర్టుకు వివరించారు. మనీషా ఇప్పటికే రెండుసార్లు సీబీఐ విచారణకు హాజరై పూర్తిగా సహకరించిందని, గత 3 రోజులుగా ఆమె పోలీసు కస్టడీలోనే ఉందని గుర్తుచేశారు. ఈమెను మథురలోని ఒక హోటల్‌లో అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న రౌస్ ఎవెన్యూ కోర్టు.. ఈ కుంభకోణంలో ఉన్న అంతర్జాతీయ/జాతీయ నెట్‌వర్క్‌ను, ఎన్‌టీఏ లీకేజీ మూలాలను గుర్తించేందుకు నిందితురాలిని 14 రోజుల పాటు ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతినిచ్చింది.






