శబరిమలలో అద్భుతం: మకరజ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన మణికంఠుడు

by Malleboina Mahesh |

కేరళలోని శబరిమల క్షేత్రం లో అద్భుత ఘట్టం చోటు చేసుకుంది. జ్యోతి కోసం భక్తుల జయజయధ్వానాలతో కేరళ కొండలు మార్మోగి పోయాయి.

శబరిమలలో అద్భుతం: మకరజ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన మణికంఠుడు
X

దిశ, వెబ్ డెస్క్: కేరళలోని శబరిమల (Sabarimala) క్షేత్రం లో అద్భుత ఘట్టం చోటు చేసుకుంది. జ్యోతి కోసం భక్తుల జయజయధ్వానాలతో కేరళ కొండలు మార్మోగి పోయాయి. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పొన్నంబలమేడు కొండలపై మకరజ్యోతి (Makarjyoti) మూడుసార్లు భక్తులకు దర్శనమిచ్చింది. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు సన్నిధానం, పంబ, ఇలువంకల్‌ వంటి ప్రాంతాలకు చేరుకున్నారు. అంతకుముందు పందళం రాజప్రసాదం నుంచి వచ్చిన 'తిరువాభరణాల'ను అయ్యప్ప స్వామికి అలంకరించిన అనంతరం నిర్వహించిన మహా హారతి సమయంలో జ్యోతి స్వరూపుడు సాక్షాత్కరించడంతో భక్తులు తన్మయత్వంతో 'స్వామియే శరణం అయ్యప్ప' అంటూ శరణుఘోష చేశారు.

దేవస్వం బోర్డు, కేరళ ప్రభుత్వం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. మకరజ్యోతి దర్శనం తర్వాత భక్తుల తిరుగు ప్రయాణం కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు, ఎలాంటి తొక్కిసలాట జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. సుమారు 1.5 లక్షల మందికి పైగా భక్తులు నేడు మకరజ్యోతిని వీక్షించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మకర జ్యోతి దర్శనంతో మండల-మకరవిళక్కు తీర్థయాత్రలో ప్రధాన ఘట్టం ముగిసింది.

Next Story