- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోట్ల రూపాయల స్కామ్.. బాధితులకు అండగా ఉంటానని మంగ్లీ హామీ
రూ. 10 కోట్లకు పైగా జరిగిన ఆర్థిక మోసం కేసులో తనపై వస్తున్న ఆరోపణలను సింగర్ మంగ్లీ కొట్టిపారేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని, నిజం నిలకడగా తెలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: అధిక వడ్డీ ఆశ చూపి అమాయక ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేసిన వార్తలు తెలంగాణలో సంచలనంగా మారాయి. ఈ ఆర్థిక మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ గాయని మంగ్లీ (సత్యవతి)మరోసారి స్పందించారు. ఈ కేసులో తన పేరును కావాలనే లాగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని, కొందరు వ్యక్తులు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, అలాగే బాధితులకు న్యాయం జరిగే వరకు తాను వారికి అండగా ఉంటానని మంగ్లీ భరోసా ఇచ్చారు.
కేసు నేపథ్యం
'గోకుల నందన ఇన్‌ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' అనే సంస్థ ద్వారా సినిమా ఫైనాన్సింగ్ పేరుతో నెలవారీ 3-5% వడ్డీ ఇస్తామని నమ్మించి సుమారు 150 మందికి పైగా ఇన్వెస్టర్ల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. మంగ్లీ తనకున్న పాపులారిటీని ఉపయోగించి ప్రజలను ఈ పథకంలో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించారని, ఆమె సోదరుడు శివ కూడా ఇందులో భాగస్వామి అని బాధితుల తరపున న్యాయవాది సింగపోగు సుబ్బారావు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగ్లీ తో పాటు ఆమె సోదరుడిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొంటూ మంగ్లీ సదరు న్యాయవాదిపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఎదురు ఫిర్యాదు చేశారు. ఈ కేసు ప్రస్తుతం పంజాగుట్ట, నార్సింగి పోలీసుల దర్యాప్తులో ఉంది. ప్రధాన నిందితుడు రామావత్ మధును పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. తన కష్టార్జితంతో పేరు తెచ్చుకున్నానని, ఎవరినీ మోసం చేయాల్సిన అవసరం తనకు లేదని మంగ్లీ మీడియా సాక్షిగా కన్నీటి పర్యంతమయ్యారు.






