- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రజబలినగర్ విద్యార్థులకు నూతన పాఠ్య పుస్తకాలు అందజేసిన మండల విద్యాశాఖాధికారి
by Jakkula.Mamatha |
అన్నపురెడ్డిపల్లి మండలం పెద్దిరెడ్డి గూడెం గ్రామ పంచాయితీలోని గిరిజన ఆవాస ప్రాంతంలోని రజబలినగర్ పాఠశాల విద్యార్థులకు నూతన పాఠ్యపుస్తకాలను, నోటు పుస్తకాలు, పెన్సిళ్లు అందజేశారు.

X
దిశ, అన్నపురెడ్డిపల్లి: అన్నపురెడ్డిపల్లి మండలం పెద్దిరెడ్డి గూడెం గ్రామ పంచాయితీలోని గిరిజన ఆవాస ప్రాంతంలోని రజబలినగర్ పాఠశాల విద్యార్థులకు నూతన పాఠ్యపుస్తకాలను, నోటు పుస్తకాలు, పెన్సిళ్లు అందజేశారు. 2025-26 విద్యా సంవత్సరంలో 11 మంది ఇక్కడ విద్యను అభ్యసించారని ఈ సంవత్సరం ప్రస్తుతం 16 మంది ఉన్నారని, ఇంకా పెరిగే అవకాశం ఉందని మండల విద్యాశాఖాధికారి ఉండేటి ఆనంద కుమార్ తెలియజేశారు. అంతేగాక తాత్కాలిక తరగతి గదిని, వంట ఏర్పాట్లను పర్యవేక్షించారు. పిల్లలు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ పుస్తక పంపిణీ కార్యక్రమంలో గ్రామస్తులు మడకం మహేష్, మార్వి జోగా, పొడియం ఉంగా, పొడియం గంగా తదితరులు పాల్గొన్నారు.
Next Story






