- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భువనగిరి ఎంపీ చామలను మర్యాదపూర్వకంగా కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు
భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శాలిగౌరారం మండల కాంగ్రెస్ నాయకులు భూపతి వెంకన్న ఆధ్వర్యంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.

దిశ, శాలిగౌరారం : భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శాలిగౌరారం మండల కాంగ్రెస్ నాయకులు భూపతి వెంకన్న ఆధ్వర్యంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వల్లాల మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు భూపతి వెంకన్న తనకు పీఏసీఎస్ (PACS) చైర్మన్ పదవికి అవకాశం కల్పించాలని ఎంపీని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నాయకులందరూ కార్యకర్తలతో సమన్వయం చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అలాగే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు మాదగోని అంజయ్య, దండెంపల్లి రామనరసయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పెరుమాండ్ల నరేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొల్లికొండ గణేష్ యాదవ్, మండల అధికార ప్రతినిధి బోడ విజయ్, మండల సహాయ కార్యదర్శి నిమ్మల కృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బోడ దానయ్య, పడాల రమేష్, మండల నాయకులు పుల్లూరి దేవేందర్, గరిగంటి శంకర్, పరుశరాములు, లింగాల శేఖర్, పుట్ట మహేష్, మిర్యాల భాస్కర్, వెంకన్న, వినయ్ తదితరులు పాల్గొన్నారు.






