- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Manchu Manoj : నడవలేని స్థితిలో ఆసుపత్రిలో చేరిన మంచు మనోజ్
మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) ఫ్యామిలీలో తరుచూ గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) ఫ్యామిలీలో తరుచూ గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం మరోసారి వీరి కుటుంబ కలహాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈరోజు ఉదయం మోహన్ బాబు, మంచు మనోజ్(Manchu Manoj) పరస్పరం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసుకున్నారు. మోహన్ బాబు తనను, తన భార్యపై దాడి చేయించాడాని మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. తర్వాత మనోజే తనపై దాడికి పాల్పడ్డాడు అంటూ మోహన్ బాబు స్టేషన్ మెట్లు ఎక్కారు. ఇదిలా ఉంటే కొద్దిసేపటి క్రితం భార్యతో కలసి నడవలేని స్థితిలో మంచు మనోజ్ ఆసుపత్రిలో చేరారు. మనోజ్ కు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స జరుగుతోంది. కాసేపట్లో మనోజ్ ఆరోగ్యంపై వైద్యులు మీడియాకు తెలపనున్నారు.
Next Story






