- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైల్డ్ పోస్టర్‌తో ‘డేవిడ్ రెడ్డి’ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన మంచు మనోజ్
కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమైన మంచు మనోజ్ (Manchu Manoj)స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు.

దిశ, సినిమా: కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమైన మంచు మనోజ్ (Manchu Manoj)స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. గత ఏడాది భైరవం, మిరాయ్ వంటి చిత్రాలతో వరుస హిట్స్ కొట్టాడు. విజయాలతో దూసుకుపోతున్న మంచు మనోజ్ మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అవుతున్నాడు. త్వరలో ‘డేవిడ్ రెడ్డి’ (David Reddy)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. తాజాగా, మంచు మనోజ్ ట్విట్టర్ ద్వారా ఆసక్తికర అప్డేట్ రాబోతున్నట్లు తెలిపాడు. ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్ పోస్టర్ జనవరి 26న రాబోతున్నట్లు తెలుపుతూ.."BRUTAL ERA BEGINS" (ఒక భీకరమైన శకం మొదలవుతోంది) అంటూ రాసుకొచ్చారు.
దీంతో ఈ సినిమాలో మనోజ్ మునుపెన్నడూ చూడని విధంగా చాలా వయోలెంట్ గా, మాస్ లుక్‌లో కనిపించబోతున్నారని అర్థమవుతోంది. ఈ సినిమా పోస్టర్లలో #WarDog అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జోడించడం విశేషం. ఇది సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ చిత్రానికి హనుమ రెడ్డి (Hanuma Reddy)దర్శకత్వం వహిస్తుండగా, టెక్నికల్ టీమ్ చూస్తుంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఇట్టే తెలిసిపోతోంది. 'కె.జి.ఎఫ్', 'సలార్' చిత్రాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అలాగే 'కె.జి.ఎఫ్' ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి, ఫైట్ మాస్టర్ సుప్రీమ్ సుందర్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. వీళ్లందరి పేర్లు చూస్తుంటే ‘డేవిడ్ రెడ్డి’ బాక్సాఫీస్ వద్ద పక్కాగా మాస్ ఊచకోత కోయడం ఖాయమనిపిస్తోంది. ఇప్పటికే చాలా కాలం గ్యాప్ తీసుకున్న మనోజ్, ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నట్లు సమాచారం.






