- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా 2022'గా వైష్ణవి శర్మ.. ప్రముఖుల అభినందనలు
దిశ, సినిమా: ‘మణప్పురం అండ్ డీ క్యూ మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా 2022’11వ ఎడిషన్ అందాల పోటీలు latest telugu news..

దిశ, సినిమా: 'మణప్పురం అండ్ డీ క్యూ మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా 2022'11వ ఎడిషన్ అందాల పోటీలు ఘనంగా జరిగాయి. ఆదివారం రాత్రి కోచిలోని 'సాజ్ ఎర్త్ రిసార్ట్స్ కన్వెన్షన్ సెంటర్'లో జరిగిన ఈ ఫైనల్ పోరులో 20 మంది అమ్మాయిలు అందంతో కట్టిపడేస్తూ హోరాహోరీగా తలపడ్డారు. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మణప్పురం, పెగాసస్ సంస్థల ప్రతినిధులు వెల్లడించారు.
ఈ మేరకు రాజస్థాన్‌కి చెందిన వైష్ణవి శర్మ 'మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా 2022' అవార్డ్ టైటిల్ విన్నర్ కాగా.. మహారాష్ట్ర అమ్మాయి 'మెహరమీట్ కౌర్', తమిళనాడుకి చెందిన 'అభినయకి' రన్నరప్ అవార్డును సొంతం చేసుకున్నారు. మొదటి విజేత వైష్ణవి శర్మను డాక్టర్ అజిత్ రవి, పెగాసస్ గ్లోబల్ ఎండి జిబితా అవార్డుతో సత్కరించగా.. మొదటి, రెండవ విజేతలను మణప్పురం 'ఎండి' అండ్ 'సి ఈ ఓ' వి. పి. నందకుమార్ అవార్డులు అందించి ఆల్ ది బెస్ట్ చెప్పారు.






