బాక్సాఫీస్ వద్ద ‘మన శంకర వరప్రసాద్ గారు’దూకుడు.. 4 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-16 07:12:01  IST  )

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రధాన పాత్రలో నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu)బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది.

బాక్సాఫీస్ వద్ద ‘మన శంకర వరప్రసాద్ గారు’దూకుడు.. 4 రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందంటే?
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రధాన పాత్రలో నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu)బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది. విడుదలైనప్పటి నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతూ.. భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే రూ. 84 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇక మూడో రోజే రూ. 150 కోట్ల క్లబ్ లో చేరిపోయిన ఈ మెగా మూవీ ఇప్పుడు రూ. 200 కోట్లకు చేరువలో ఉంది. 4 రోజుల్లో మొత్తం రూ. 190 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటిస్తూ.. మెగాస్టార్ మాస్ పోస్టర్‌ను షేర్ చేశారు. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటేసిందని తెలుస్తోంది. చిరంజీవి, వెంకటేష్ కాంబోలో వచ్చిన ఈ సినిమాను అనిల్ రావిపూడి (Anil Ravipudi)తెరకెక్కించారు. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటించగా.. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా మన శంకరవరప్రసాద్ గారు సినిమాను నిర్మించారు. భీమ్స్ అందించిన పాటలు సినిమాకే హైలెట్‌గా నిలిచాయనడంలో అతిశయోక్తి లేదు. సంక్రాంతి కానుకగా వచ్చిన చిరు ఘన విజయం సాధించడంతో పాటు ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు.

Read More..

ఒకే ఫ్రేమ్‌లో త్రీ స్టార్స్.. ఆకట్టుకుంటున్న క్యూట్ ఫొటో

Next Story