ఒకే ఫ్రేమ్‌లో త్రీ స్టార్స్.. ఆకట్టుకుంటున్న క్యూట్ ఫొటో

by I. Sairam |   (  Updated:2026-01-15 05:36:43  IST  )

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu)సినిమా జనవరి 12న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది.

ఒకే ఫ్రేమ్‌లో త్రీ స్టార్స్.. ఆకట్టుకుంటున్న క్యూట్ ఫొటో
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu)సినిమా జనవరి 12న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara), క్యాథరీన్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh0 గెస్ట్ రోల్‌లో కనిపించారు.

ఇక ఈ సినిమాకు ఫస్ట్ షో నుంచే హౌస్‌ఫుల్ బోర్డులు పడుతుండగా, ఫెస్టివల్ సీజన్‌కు తగ్గట్టు సినిమా థియేటర్లలో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. అలా సినిమా విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సునామీలా దూసుకెళ్తోంది. అంతేకాకుండా కలెక్షన్స్ విషయంలో కోట్లు కొల్లగొడుతోంది. ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి,మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ముగ్గురు ఒకే చోట కూర్చొన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. వైరల్ అవుతున్న ఫొటోలో.. సంక్రాంతి స్పెషల్‌గా అందరూ పట్టు పంచా కట్టుకొని ట్రెడిషనల్‌గా కనిపించారు.

వాళ్లకి వెనకాల అంతా బంతి పూలు, అరటి తోరణాలు, గాలి పటాలతో సంక్రాంతి థీమ్‌లో డెకరేషన్ చేసి ఉంది. ఇక ఈ ఫొటోస్‌కు.. ‘అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. మనశంకరవరప్రసాద్ గారు బృందం యొక్క సూపర్ స్పెషల్ సంక్రాంతి ఇంటర్వ్యూ ఈరోజు మీ ముందుకు వస్తోంది.. సుందరమైన మరియు హృదయపూర్వక సంభాషణతో పండుగను జరుపుకోవడానికి వేచి ఉండండి’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం త్రీ స్టార్స్ కలిపి ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఈ క్యూట్ ఫొటో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Next Story