- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రపంచంలోనే అత్యంత బరువైన స్ట్రాబెర్రీ.. గిన్నిస్ రికార్డు!
by Web Desk |

X
దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్‌కు చెందిన స్ట్రాబెర్రీ పండ్ల వ్యాపారి ఏరియల్ చాహి అనే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత బరువైన స్ట్రాబెర్రీ పండించినందుకు ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఫిబ్రవరి 12, 2021న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెల్లడించిన విధంగా ఈ స్ట్రాబెర్రీ ఆశ్చర్యపరిచే విధంగా 289 గ్రా (10.19 oz) బరువు కలిగి ఉంది. ఈ స్ట్రాబెర్రీ 4 సెంటీమీటర్ల మందం, 18 సెంటీమీటర్ల పొడవు, 34 సెంటీమీటర్ల చుట్టు కొలతను కలిగి ఉంటుంది. అయితే చిన్న స్ట్రాబెర్రీ ఒక ఐఫోన్ కంటే ఎక్కువ బరువు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇజ్రాయెల్‌లోని కడిమా-జోరాన్ ప్రాంతంలో ఉన్న ఒక పొలంలో వ్యక్తి యొక్క కుటుంబ వ్యాపారంలో భాగంగా స్ట్రాబెర్రీ ని పెంచారు. అయితే ఇప్పటివరకూ జపాన్‌కు చెందిన కోజీ నాకో అనే ఆయన పండించిన 250 గ్రాముల బరువున్న స్ట్రాబెర్రీదే రికార్డు.
Next Story