- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్యపై అనుమానంతో కత్తితో దాడి.. చికిత్స పొందుతూ మృతి
by Jakkula.Mamatha |
అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తేజస్వి నగర్ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, రాజేంద్రనగర్: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తేజస్వి నగర్ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాందేడ్ ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు కోమల్(33), అవినాష్‌ల మధ్య శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. భార్యపై అనుమానం పెంచుకున్న అవినాష్, కోపోద్రిక్తుడై కత్తితో కోమల్‌పై విచక్షణారహితంగా దాడి చేసాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలపాలైన కోమల్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఘటన స్థలాన్ని క్లూస్ టీం పరిశీలించి ఆధారాలు సేకరించారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






