- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి
చేపలు పట్టడానికి వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన సంఘటన నర్సాపూర్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

దిశ, నర్సాపూర్ : చేపలు పట్టడానికి వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన సంఘటన నర్సాపూర్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి కథనం ప్రకారం లింగాపూర్ గ్రామానికి చెందిన బొమ్మల చంద్రయ్య (51) చేపలు పడుతూ, కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులందరూ భోజనం చేసి పడుకునే సమయంలో రాత్రి 11 గంటలకు బయటకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పాడు. ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో భార్యతో పాటు కుటుంబ సభ్యులందరూ చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదన్నారు.
మరుసటి రోజు సోమవారం గ్రామ సమీపంలో ఉన్న కొమ్మన్ చెరువు కట్టపై మృతుడు చంద్రయ్యకు చెందిన బజాజ్ స్కూటర్, చెప్పులు ఉండగా చూసిన కొందరు గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వచ్చి చూడగా, చంద్రయ్య చేపల వలలో చిక్కుకుని మృతి చెందినట్లు గుర్తించారు. మృతి చెందిన చంద్రయ్య మృతదేహాన్ని బయటకు తీసి నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తన భర్త చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెంది ఉంటాడని మృతుడి భార్య మంజుల ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి తెలిపారు.






