జాతీయ రహదారి పక్కన వ్యక్తి ఆత్మహత్య

by Ratna Kumari |

జాతీయ రహదారి-365 పక్కన చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్లబెల్లి మండలం శనిగరం గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది.

జాతీయ రహదారి పక్కన వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, నర్సంపేట : జాతీయ రహదారి-365 పక్కన చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్లబెల్లి మండలం శనిగరం గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ దేవేందర్‌గా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. గురువారం ఉదయం కూలీలను ముద్దనూరు తండాకు తీసుకెళ్లిన అనంతరం తిరుగు ప్రయాణంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానా లేదా ఇతర కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story