భార్య, ముగ్గురు పిల్లల గొంతు కోసి చంపిన కిరాతకుడు

by Malleboina Mahesh |

ఢిల్లీ చందన్ పార్క్ ఏరియాలో ముంచన్ కెవాత్ అనే వ్యక్తి తన భార్య, ముగ్గురు చిన్నారులను దారుణంగా హత్య చేశాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

భార్య, ముగ్గురు పిల్లల గొంతు కోసి చంపిన కిరాతకుడు
X

దిశ, వెబ్ డెస్క్: ఓ కిరాతక వ్యక్తి తన భార్య ముగ్గురు పిల్లలను అతికిరాతంగా హత్య చేయడం దేశ రాజధానిలో సంచలనంగా మారింది. నిహాల్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందన్ పార్క్ ప్రాంతంలో అత్యంత ఈ దారుణమైన ఘటన వెలుగుచూసింది. ముంచన్ కెవాత్ అనే వ్యక్తి తన భార్య అనిత (35)తో పాటు ముగ్గురు చిన్న పిల్లలు కుంకుమ్ (9), అభిషేక్ (6), ఆర్యన్ (4)లను గొంతు కోసి అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన తర్వాత నిందితుడు ఇంటికి బయటి నుంచి తాళం వేసి పరారయ్యాడు. ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తాళాలు పగలగొట్టి చూడగా, రక్తపు మడుగులో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.

ప్రాథమిక విచారణ ప్రకారం, కుటుంబ కలహాలే ఈ సామూహిక హత్యలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. వృత్తిరీత్యా కూలీ అయిన నిందితుడు ముంచన్ కెవాత్, తరచూ భార్యతో గొడవ పడేవాడని సమాచారం. పథకం ప్రకారమే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలం నుండి నమూనాలను సేకరించాయి. దేశ రాజధానిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

Next Story