భార్య పై అనుమానంతో వ్యక్తి హత్య.. నిందితుడి అరెస్ట్

by Batti.Sumithra |

అక్రమ సంబంధం అనుమానంతో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

భార్య పై అనుమానంతో వ్యక్తి హత్య.. నిందితుడి అరెస్ట్
X

దిశ, కొత్తగూడెం : అక్రమ సంబంధం అనుమానంతో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ ఆదినారాయణ ఈ అంశంపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం అంబేద్కర్ నగర్‌కు చెందిన శివాజీ (శ్రీను కుమారుడు) తన భార్యకు అదే గ్రామానికి చెందిన నాగరాజుతో అక్రమ సంబంధం ఉందని అనుమానించాడు. ఈ నేపథ్యంలో జూన్ 21 రాత్రి సుమారు 10:20 గంటల సమయంలో శివాజీ తన భార్య నాగేశ్వరి, చెల్లెలు పరిశుద్ధ అలియాస్ ప్రమీల ప్రోద్బలంతో నాగరాజును హత్య చేయాలని పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం నాగరాజు ఇంటికి వెళ్లి, ఇంట్లో నిద్రిస్తున్న నాగరాజు పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి హత్య చేసి అక్కడి నుంచి పరారైనట్లు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడు శివాజీ తన ఇంటికి వచ్చినట్లు సమాచారం అందడంతో ఇన్‌స్పెక్టర్ ఎం. కరుణాకర్ తన సిబ్బందితో కలిసి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, ఘటన సమయంలో ధరించిన టీ-షర్టును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.

Next Story