- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమిత్ షాపై లీగల్ నోటీసులకు సిద్దమైన దీదీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం రెండో దశకు చేరుకుంటున్న వేళ, TMC, BJP మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం రెండో దశకు చేరుకుంటున్న వేళ, అధికార తృణమూల్ కాంగ్రెస్(TMC), భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా సీఎం మమతా బెనర్జీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని లీగల్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవ్వడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. శనివారం హూగ్లీలో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో మాట్లాడిన దీదీ, అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి, ఎన్నికల ప్రచారంలో భాగంగా హింసను ప్రేరేపించేలా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి విఘాతమని ఆమె మండిపడ్డారు.
అమిత్ షా ఇటీవలి ర్యాలీలలో తృణమూల్ కార్యకర్తలను ఉద్దేశించి.. బెంగాల్‌లో ఎన్నికల తర్వాత "తృణమూల్ గూండాలను తలక్రిందులుగా వేలాడదీసి సరిదిద్దుతాం" అని చేసిన హెచ్చరికలు పెను దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు నేరుగా హింసను ప్రోత్సహించేలా ఉన్నాయని, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. "మేము ఇప్పటికే లాయర్లతో సంప్రదింపులు జరిపాము, అమిత్ షాపై లీగల్ కేసు ఫైల్ చేయబోతున్నాం" అని ఆమె స్పష్టం చేశారు. హోం మంత్రిగా శాంతిభద్రతలను కాపాడాల్సిన వ్యక్తే ఇలాంటి "వైలెంట్ రిమార్క్స్" చేయడం ఆశ్చర్యకరమని ఆమె వ్యాఖ్యానించారు.






