మైనర్లకు వాహనాలు ఇచ్చే వారి పై కఠిన చర్యలు.. మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక

by Jakkula.Mamatha |

మైనర్ డ్రైవింగ్ చట్టపరంగా తీవ్రమైన నేరమని మల్కాజ్గిరి పోలీసు కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.

మైనర్లకు వాహనాలు ఇచ్చే వారి పై కఠిన చర్యలు.. మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక
X

దిశ, సిటీ క్రైమ్: మైనర్ డ్రైవింగ్ చట్టపరంగా తీవ్రమైన నేరమని మల్కాజ్గిరి పోలీసు కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. మైనర్ డ్రైవింగ్ కేసులలో పూర్తి ఆధారాలతో చార్జీషీటును రూపొందించి కోర్టుకు సమర్పిస్తాం. మైనర్లకు వాహనాలు ఇచ్చే వారు పూర్తి బాధ్యులవుతారని పోలీసులు స్పష్టం చేశారు. మైనర్ డ్రైవింగ్ వల్ల వాహనం నడిపించే పిల్లలతో పాటు, రోడ్ల పై ఇతర వాహనదారులు ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మైనర్ డ్రైవింగ్ ను ఎవరు ప్రోత్సహించవద్దని పోలీసులు కోరుతున్నారు. గురువారం మల్కాజ్గిరి పోలీసు కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 17 మైనర్లు డ్రైవింగ్ చేస్తూ దొరికారని పోలీసులు పేర్కొన్నారు. అదే విధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, ఇతర పత్రాలు లేకుండానే వాహనాలను నడుపుతున్న 1496 వాహనదారుల పై పోలీసులు మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సూచిస్తున్నారు. వాహనదారులు కూడా అన్ని పత్రాలను వెంట పెట్టుకోవాలని కోరుతున్నారు.

Next Story