- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు మలికంటి శంకర్ మృతి
మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు బీఆర్ఎస్ మండల వ్యవస్థాపక సభ్యులు మలికంటి శంకర్(తెలంగాణ శంకర్)(55) గురువారం రాత్రి రాజుపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

దిశ, మంగపేట: మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు బీఆర్ఎస్ మండల వ్యవస్థాపక సభ్యులు మలికంటి శంకర్(తెలంగాణ శంకర్)(55) గురువారం రాత్రి రాజుపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాత్రి 9:45 ప్రాంతంలో తన హోటల్ నుంచి లక్ష్మీనర్సాపురం రోడ్డుకి వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ఓ వాహనం హెడ్ లైట్ల వెలుతురులో ముందు ఉన్న ఎడ్ల బండి కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న శంకర్ బండిని బలంగా గుద్దుకోవడంతో అక్కడికక్కడే పడిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శంకర్‌కు సీపీఆర్ చేసి వెంటనే హన్మకొండ తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు.
శంకర్‌కు భార్య సునిత, మదు, రాజు కొడుకులున్నారు. శంకర్ మృతితో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన మలి దశ తెలంగాణ ఉద్యమంలో నిబద్ధత గల నాయకుడిగా తెలంగాణ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పని చేశారు. టీఆర్ఎస్ పార్టీ(ప్రస్తుత బీఆర్ఎస్) ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతానికి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. మలికంటి శంకర్ మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.






