- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మక్కల్ నీధి మయ్యం పార్టీకి 'బ్యాటరీ టార్చ్' గుర్తు కేటాయింపు
పుదుచ్చేరి ఎన్నికల బరిలో కమల్ హాసన్ పార్టీ.. ఎంఎన్ఎంకు 'బ్యాటరీ టార్చ్' గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం. గతంలోను బ్యాటరీ టార్చ్ లైట్.. పల్లే ఓటర్లకు సులభంగా గుత్తుంటదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు కమల్ హాసన్ తమిళనాడులో మక్కల్ నీధి మయ్యం (MNM) పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ పార్టీ ప్రత్యక్షంగా త్వరలో జరగబోయే తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది. 2026 పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీధి మయ్యం (MNM) పార్టీకి భారత ఎన్నికల సంఘం 'బ్యాటరీ టార్చ్' గుర్తును కేటాయిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ఎన్నికల్లో కూడా ఇదే గుర్తుపై పోటీ చేసిన ఎంఎన్ఎం, తాజాగా జరగనున్న ఎన్నికల్లోనూ తమ పాత గుర్తునే నిలుపుకోవడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ మేరకు పార్టీ అభ్యర్థులు పుదుచ్చేరిలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ గుర్తుపై పోటీ చేయనున్నారు.
గతంలో తమిళనాడులో కూడా ఈ గుర్తు పైనే పోటీ చేసిన కమల్ హాసన్ పార్టీ, పుదుచ్చేరిలో తన ఉనికిని చాటుకునేందుకు సిద్ధమవుతోంది. గుర్తు కేటాయింపు పూర్తవ్వడంతో ఇక ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఎన్నికల గుర్తు అనేది ఓటర్లలోకి పార్టీని బలంగా తీసుకెళ్లడానికి దోహదపడుతుందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 'టార్చ్' గుర్తు ప్రజలకు సులభంగా గుర్తుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






