ఆదివాసి సేన రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయండి

by Ratna Kumari |

నవంబర్ 24, 25 తేదీల్లో నిర్వహించనున్న ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని ఆదివాసి సేన రాష్ట్ర అధ్యక్షుడు కోవా దౌలత్‌రావు, ప్రధాన కార్యదర్శి మడి సాయిబాబు పిలుపునిచ్చారు.

ఆదివాసి సేన రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయండి
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : నవంబర్ 24, 25 తేదీల్లో నిర్వహించనున్న ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని ఆదివాసి సేన రాష్ట్ర అధ్యక్షుడు కోవా దౌలత్‌రావు, ప్రధాన కార్యదర్శి మడి సాయిబాబు పిలుపునిచ్చారు. ములుగు జిల్లాలోని ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరుగుతున్న ఆదివాసి సేన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ఆదివారం చివరి రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసుల హక్కులైన జల్–జంగల్–జమీన్ పరిరక్షణ కోసం పోరాడి అమరులైన బిర్సా ముండా, కొమురం భీమ్, రాంజీగోండ్, సోయం గంగులు, రాణి దుర్గావతి, సమ్మక్క–సారలమ్మ స్ఫూర్తితో రానున్న రోజుల్లో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

భద్రాచలంలో నిర్వహించనున్న రాష్ట్ర మహాసభల్లో ఆదివాసుల సమస్యల పరిష్కారానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుని కార్యాచరణను రూపొందిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆదివాసి సేన సలహాదారు గుండు శరత్, రాష్ట్ర నాయకులు సొడే వెంకటేశ్వర్లు, కొమరం అనిల్ కుమార్, ఊకే రవి, చింత ఆరుణతో పాటు పలు జిల్లాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

Next Story