- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, గండిపేట: పోచమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. అమ్మవారి వెండి కిరీటంతో పాటు నగలను దొంగలు అపహరించుకుపోయారు. సుమారు రూ.20 లక్షలు విలువచేసే సొత్తు చోరీ జరిగిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ పోచమ్మ ఆలయంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయంలోకి సోమవారం అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. ఆలయంలోని హుండీలు ధ్వంసం చేశారు. అమ్మవారి తలపై వెండి పూతతో ఉన్న భారీ కిరీటంతో పాటు ఇతర వెండి నగలను అపహరించారు. ఇతర విలువైన వస్తువులతో పాటు సీసీటీవీ డీవీఆర్‌ను కూడా అపహరించుకు పోయారు.
ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నం చేశారు. చోరీ విషయం మంగళవారం ఉదయం వెలుగు చూసింది. ఆలయ కమిటీ అంచనా ప్రకారం చోరీకి గురైన నగలు, వస్తువులు జరిగిన నష్టం కలిపి సుమారు రూ.20 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై ఆలయ కమిటీ సభ్యులు స్పందిస్తూ, ఆలయం పరిసరాలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.






