టీసీ కోసం.. ఓ తండ్రి ప్రాణత్యాగానికి యత్నం !

by Batti.Sumithra |

టీసీ కోసం ఓ తండ్రి పెట్రోల్ పోసుకుని ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సంఘటన జహీరాబాద్ ప్రాంతంలో తీవ్రకలకలం రేపింది.

టీసీ కోసం.. ఓ తండ్రి ప్రాణత్యాగానికి యత్నం !
X

దిశ, జహీరాబాద్ : టీసీ కోసం ఓ తండ్రి పెట్రోల్ పోసుకుని ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సంఘటన జహీరాబాద్ ప్రాంతంలో తీవ్రకలకలం రేపింది. పాఠశాలలో చదవకపోయినా ఫీజు చెల్లించాల్సిందేనంటూ, లేకపోతే టీసీ ఇచ్చే ప్రసక్తే లేదని భీష్మించిన ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం తండ్రి ఆందోళనతో ఎట్టకేలకు దిగివచ్చింది. బాధితుడు పెట్రోల్‌తో ఆత్మహత్యాయత్నానికి సిద్ధపడటంతో పరిస్థితుల తీవ్రతను అర్థం చేసుకున్న యాజమాన్యం తమ తప్పును తెలుసుకుని విద్యార్థినికి టీసీ జారీ చేసింది. జహీరాబాద్ మున్సిపల్ రంజాన్ లోగల ఓ ప్రైవేటు పాఠశాలలో పట్టణానికి చెందిన గోవర్ధన్ కుమార్తె మోక్షిత 6వ తరగతి చదవాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమెను వేరే పాఠశాలలో చేర్పించేందుకు తండ్రి గోవర్ధన్ టీసీ కోసం యాజమాన్యాన్ని ఆశ్రయించాడు.

చదవని కాలానికి కూడా ఫీజు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని, లేదంటే ఇచ్చేది లేదని యాజమాన్యం మొండికేసింది. ఎంత వేడుకున్నా పాఠశాల నిర్వాహకులు కనికరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి గోవర్ధన్ తనతో పెట్రోల్ తెచ్చుకుని గేటుముందు బైఠాయించి ఆందోళన చేపట్టాడు. టీసీ కోసం పెట్రోల్ పోసుకుని ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. తండ్రి తీవ్ర నిర్ణయానికి సిద్ధపడటంతో పాఠశాల ప్రాంగణంలో తీవ్ర కలకలం రేగింది. అక్కడున్నవారు వెంటనే స్పందించి ప్రమాదాన్ని తప్పించారు. అనంతరం తమ నిర్లక్ష్యాన్ని, తప్పును తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం తప్పనిసరి పరిస్థితుల్లో దిగివచ్చి, విద్యార్థిని మోక్షితకు ఉచితంగానే టీసీని అందజేసింది. క్షణంలో ప్రమాదం తప్పడంతో పాటు బాలిక విద్యార్థి జీవితానికి ఆటంకం కలగకుండా టీసీ లభించడంతో స్థానికులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. టీసీ రాసేంత సమయం కూడా తమకు ఇవ్వకపోవడంతోనే జాప్యం జరిగిందే కానీ, డబ్బుల కోసం కాదని సదరు పాఠశాల ప్రతినిధులు వివరించారు.

Next Story