- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం... ఇద్దరు కార్మికులు మృతి
విశాఖ పరవాడ ఫార్మాసిటీలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకుని వెంకటేశ్, త్రిణాథ్ అనే ఇద్దరు కార్మికులు దుర్మరణం!

దిశ, వెబ్ డెస్క్: ఫార్మాసిటీ (Pharma City)లో భారీ అగ్నిప్రమాదం (fire hazard) చోటు చేసుకొని ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి విశాఖ జిల్లాలో గల పరవాడ పారిశ్రామికవాడలో చోటు చేసుకుంది. కార్మికులు తమ విధులు నిర్వహిస్తుండగా తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రాణ భయంతో పరుగులు తీశారు. అయినప్పటికి మంటలు వేగంగా వ్యాప్తి చెందడం, ఊపిరాడకపోవడం తో ఇద్దరు కార్మికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ సమాచారం అందుకు ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. అలాగే ఈ ప్రమాదంలో గాయాలైన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులను వేపాడ వెంకటేష్, త్రినాథ్ లుగా అధికారులు గుర్తించారు. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉండగా.. పూర్తి వివరాలు అందుబాటులోకి రాలేదు.






