Samantha: ఆ ఫొటో షేర్ చేసి.. చైతో ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సమంత..

by Dishanational2 |
Samantha: ఆ ఫొటో షేర్ చేసి.. చైతో ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సమంత..
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ లవ్‌లీ కపుల్ అంటే సమంత, నాగచైతన్యనే. ఇక పలు కారణాల వలన వీరు విడిపోయిన విషయం తెలిసిందే. అయితే వీరు విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించిన తర్వాత వరస సినిమాలతో బిజీ అయిపోయారు. అయితే ఇటీవల సామ్ తన ఇన్‌స్టాలో చైతూతో ఉన్న ఫొటోస్ అన్నీ డిలీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సమంత నాగచైతన్య ఫొటోను ఈరోజు (మంగళవారం) తన ఇన్ స్టాగ్రాంలో ఫోస్ట్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కాగా, సమంత, చైతూ అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే సమంత, నాగచైతన్య కలిసి చేసిన సినిమాల్లో మజిలీ ఒకటి. ఈ సినిమా రిలీజ్ అయి నేటికి 3 సంవత్సరాలు అయింది. దీంతో సమంత తన ఇన్‌స్టా స్టోరీలో మజిలీ పోస్టర్‌ని పెట్టింది. ఇక నాగచైతన్య సింగిల్ పిక్‌.. వెనకాల ఇద్దరు హీరోయిన్లు ఉన్న ఫొటో‌ను సామ్ షేర్ చేసింది. ప్రస్తుతం సామ్ ట్వీట్ వైరల్‌గా మారింది. ఇక ఇది చూసిన కొందరు సామ్, చై కలిసి త్వరలో సినిమా చేయాలని అంటుండగా, మరికొందరు సమంత, నాగచైతన్య సినిమాలోలాగా మళ్లీ కలిసిపోండి అని కామెంట్స్ పెడుతున్నారు.


Next Story

Most Viewed