ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మహీంద్రా భారీ ప్రణాళిక!

by Dishanational1 |
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మహీంద్రా భారీ ప్రణాళిక!
X

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) కొంచెం ఆలస్యమైనా ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) విభాగంలో దూకుడుగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు కంపెనీలు ఈవీ విభాగంలో ప్రణాళికలు సిద్ధం చేసిన తర్వాత ఎంఅండ్ఎం ఈవీల కోసం కొత్త కంపెనీని ఏర్పాటు చేయనున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీనికోసం బ్రిటన్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ఎంఅండ్ఎంలో రూ. 1,925 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ నేపథ్యంలో మహీంద్రా సంస్థ రాబోయే ఐదేళ్లలో 2 లక్షల ఈవీల విక్రయాలను లక్ష్యంగా ఉన్నట్టు తెలిపింది. ఈవీ విభాగంలో దాదాపు రూ. 7,900 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగానే 2026-27 సమయానికి ఐదు ఈవీలను తీసుకురానున్నామని, అలాగే కంపెనీలోని మొత్తం వాహనాల్లో ఈవీల వాటా 20-30 శాతానికి పెంచుతాయని మహీంద్రా ప్రతినిధి రాజేశ్ అన్నారు. భవిష్యత్తులోనూ ఈవీ విభాగం కోసం మరిన్ని నిధులను సమీకరించనున్నట్టు కంపెనీ పేర్కొంది. ఈ క్రమంలోనే మహీంద్రా నుంచి ఈవీ విభాగంలో ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ మోడల్‌ను శుక్రవారం ఆవిష్కరించింది.


Next Story

Most Viewed