- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిప్యూటీ CM భట్టి ఇంట్లో మంత్రుల అత్యవసర భేటీపై పీసీసీ చీఫ్ స్పందన
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాసంలో మంత్రుల అత్యవసర సమావేశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాసంలో మంత్రుల అత్యవసర సమావేశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం విదేశాల్లో ఉన్నారు కాబట్టే పాలన అంశంలో మంత్రులు సమావేశం జరిపితే తప్పులేదు. BRS హయాంలో సింగరేణిలో అవకతవకలపై విచారణ జరగాలి. ఫోన్ ట్యాపింగ్‌లో అందరికీ నోటీసులు ఇవ్వాల్సిందే. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. హరీష్‌రావు, కేటీఆర్ కలిసి కొందరి లబ్ధికోసం వారి హయాంలో కాంట్రాక్టులు ఇచ్చారు’ అని మహేష్ కుమార్ అన్నారు. ఇదిలా ఉంటే.. సింగరేణి కుంభకోణం అంశంపై రేపు బీఆర్ఎస్ నేతల బృందం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలువనున్నది. రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని.. ముఖ్యంగా సింగరేణి సంస్థలో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తున్నదని.. ఈ భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలవాలని నిర్ణయం తీసుకున్నారు. సింగరేణిలో జరిగిన అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు, లోతైన వివరాలతో కూడిన సమగ్ర నివేదికను బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌కు సమర్పించనున్నారు.






