‘BC ముఖ్యమంత్రి’పై మహేశ్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

ప్రజా ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

‘BC ముఖ్యమంత్రి’పై మహేశ్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీ ముఖ్యమంత్రి అయ్యే టైంలో అవుతారని అన్నారు. మున్ముందు బీసీలకు చాలా అవకాశాలు వస్తాయని తెలిపారు. అవకాశం ఉన్న ప్రతీ చోట బీసీలకు పదవులు ఇస్తూ వెళ్తున్నామని చెప్పారు. కష్టపడి పనిచేస్తే ఎవరి వాటా వాళ్లకు వస్తుందని.. దీనిని ఎవరూ ఆపలేరని అన్నారు. రాబోయే రోజులు అన్నీ బీసీలవే అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. దేవుళ్ల పేరిట రాజకీయాలు దేశానికి మంచిది కాదని, కులం, మతం అనేవి మన పిల్లలకు భవిష్యత్తును తీసుకురావని మహేశ్ గౌడ్ అన్నారు. రాముడు, అంజనేయుడి పేరు చెప్పి బీజేపీ వాళ్లు ఓట్లు దండుకుంటున్నారని విమర్శించారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ జై శ్రీరాం అని అనకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలన్నారు. ఆయన రాముని పేరు చెప్పడం తప్ప నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్​ జెండా ఎగుర వేస్తామన్నారు. దేవుళ్లతో రాజకీయాలను ముడి పెట్టవద్దని అన్నారు.

Next Story