హాలీవుడ్‌ మూవీ ప్రాజెక్ట్‌పై మహేశ్ బాబు కామెంట్స్

by Disha Web Desk 17 |
హాలీవుడ్‌ మూవీ ప్రాజెక్ట్‌పై మహేశ్ బాబు కామెంట్స్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'సర్కారువారి పాట' రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక సినిమా విడుదలకు ముందే ఆయన హాలిడే ట్రిప్ కోసం ఫారిన్ వెళ్లినట్లు సమాచారం. ఈ వెకేషన్ తర్వాత స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో తన తదుపరి చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఈ సినిమా తర్వాత 2022 చివరన రాజమౌళితో చేయనున్న మూవీ సెట్స్‌లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది. ఈ విషయం పక్కనబెడితే.. మహేశ్ ఓ హాలీవుడ్ సినిమాకు కమిట్ అయ్యాడన్న టాక్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ప్రిన్స్ ఈ న్యూస్‌పై స్పదించ లేదు, కానీ ఈ మధ్యకాలంలో ఆ రూమర్స్ ఎక్కువ అవడంతో ఎట్టకేలకు లేటెస్ట్ మీడియా ఇంటరాక్షన్‌లో ఆ విషయంపై స్పందించాడు. తాను ఏ హాలీవుడ్ మూవీకి కమిట్ అవ్వలేదని క్లారిటీ నిచ్చారు. అయితే రాజమౌళితో సినిమా చేయడానికి మాత్రం ఇంకొంచెం టైమ్ పడుతుందని చెప్పారు.

Next Story

Most Viewed