- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సితార పాపకు మహేశ్ బాబు స్పెషల్ బర్త్‌డే విషెస్
by Malleboina Mahesh |
దిశ, సినిమా : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. కుటుంబానికి తప్పకుండా టైమ్ కేటాయిస్తాడు.

X
దిశ, సినిమా : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. కుటుంబానికి తప్పకుండా టైమ్ కేటాయిస్తాడు. అందులో భాగంగానే ఇటీవల యూరప్, అమెరికాలో వెకేషన్ ముగించుకుని తిరిగొచ్చారు. ఇందుకు సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. నేడు(జులై 20) మహేశ్ గారాల పట్టి సితార ఘట్టమనేని 10వ పుట్టినరోజు జరుపుకుంటోంది. దీంతో సీతు పాప ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మహేశ్.. 'వరల్డ్‌లోనే బ్రైటెస్ట్ స్టార్‌కు ప్రేమతో.. హ్యాపీ బర్త్‌డే సితార, నా ప్రేమ ఎప్పటికీ ఉంటుంది' అంటూ బర్త్‌డే విషెస్ తెలియజేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. సోషల్ మీడియాలో ఇప్పటికే బోలెడంత మంది అభిమానులను సంపాదించుకున్న సితారకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story






