Mahesh Babu: 30 మంది చిన్నారుల గుండె చప్పుడుగా 'మహేశ్ బాబు'

by Dishanational2 |
Mahesh Babu: 30 మంది చిన్నారుల గుండె చప్పుడుగా మహేశ్ బాబు
X

దిశ, సినిమా : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు 'వరల్డ్ హెల్త్ డే' సందర్భంగా 30 మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే మహేశ్.. ఇప్పటి వరకు వెయ్యికి పైగా గుండె ఆపరేషన్లు చేయించి చిన్నారుల గుండె చప్పుడుగా నిలుస్తున్నారు. కాగా మహేశ్ బాబు ఫౌండేషన్, విజయవాడ ఆంధ్రా హాస్పిటల్స్ కలిసి 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం' సందర్భంగా ఒకే రోజు 30 మంది పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించినట్లుగా మహేశ్ వైఫ్ నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టా పోస్టులో పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషన్ చేతుల మీదుగా ప్రారంభించినట్లు తెలిపిన నమ్రత.. సహకరించిన ఆంధ్రా హాస్పిటల్స్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఈ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ వందల మంది చిన్నారుల గుండెను కాపాడిన ఘనత మహేశ్, నమ్రత దక్కించుకున్నారని.. వారి మంచి మనసు గురించి ఎంత చెప్పినా తక్కువేనని ప్రశంసిస్తున్నారు.



Next Story

Most Viewed