జర్నలిస్టుల రిమాండ్ రిజెక్ట్ చేసిన మేజిస్ట్రేట్

by Muthe.Rajitha |

హైదరాబాద్‌లోని ఎన్‌టీవీ ఛానల్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టులు దొంతు రమేష్ (ఇన్‌పుట్ ఎడిటర్), సుధీర్‌ (రిపోర్టర్)ల రిమాండ్‌ను మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది.

జర్నలిస్టుల రిమాండ్ రిజెక్ట్ చేసిన మేజిస్ట్రేట్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ఎన్‌టీవీ ఛానల్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టులు దొంతు రమేష్ (ఇన్‌పుట్ ఎడిటర్), సుధీర్‌ (రిపోర్టర్)ల రిమాండ్‌ను మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. ఇటీవల ఒక మహిళా ఐఏఎస్ అధికారిణి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య సంబంధం ఉందని ప్రసారమైన వార్తను "పరువు నష్టం"గా పేర్కొంటూ పలువురు జర్నలిస్టులను తెలంగాణ పోలీసులు నేడు అరెస్టు చేశారు. దొంతు రమేష్‌ను హైదరాబాద్ విమానాశ్రయంలో బ్యాంకాక్ వెళ్లేందుకు ఎదురు చూస్తుండగా.., సుధీర్‌ను ఆయన ఇంటి వద్ద మంగళవారం తెల్లవారు జామున అదుపులోకి తీసుకున్నారు. అయితే జర్నలిస్టులను అరెస్టులు చేయడం రాష్ట్రంలో పెద్ద దుమారం రేపింది.

నేడు వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ కోరగా... ప్రాథమిక ఆధారాలు సరిపోవడం లేదని, అరెస్టు ప్రక్రియలో నోటీసు ఇవ్వకపోవడం వంటి లోపాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఇది ప్రెస్ స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యగా మారుతుందని పేర్కొంటూ రిమాండ్‌ను తిరస్కరించి, బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. ఈ ఘటనలో బీఆర్ఎస్, వైఎస్సార్‌సీపీ నేతలు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా స్పందించగా.. పోలీసు అధికారులు మాత్రం తమ చర్య చట్టబద్ధమేనని తెలిపారు. ఈ వ్యవహారం తెలంగాణలో మీడియా స్వేచ్ఛపై పెద్ద చర్చకు దారితీసింది.

Next Story