- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ఎస్సీ జనాభాలో మాదిగలదే సింహభాగం.. 36.5 లక్షల జనాభాతో నంబర్ వన్
తెలంగాణ ఎస్సీల్లో మాదిగలే టాప్! 36.5 లక్షల జనాభాతో అగ్రస్థానంలో మాదిగ సామాజిక వర్గం. SEEEPC సర్వే-2024 లో ఆసక్తికర గణాంకాలు వెల్లడి.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన షెడ్యూల్డ్ కులాల (SC) సామాజిక, ఆర్థిక స్థితిగతులపై నిర్వహించిన SEEEPC సర్వే-2024 గణాంకాలను అధికారికంగా వెల్లడించింది. రాష్ట్రంలోని మొత్తం ఎస్సీ జనాభాలో మాదిగ సామాజిక వర్గం అత్యధిక జనాభాతో ప్రథమ స్థానంలో నిలిచింది. సర్వే నివేదిక ప్రకారం, రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ కులస్థుల జనాభా 36,57,551 గా నమోదైంది. రాష్ట్రం మొత్తం జనాభాలో వీరి వాటా 10.3 శాతంగా ఉండటం విశేషం. కేవలం ఎస్సీ కులాల్లోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గాల్లో ఒకటిగా మాదిగలు నిలిచారు.
ఎస్సీ కులాల జాబితాలో మాదిగలు అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో మాల సామాజిక వర్గం 14,71,514 (4.1%) జనాభాతో నిలిచింది. వీరి తర్వాత బెడ/బుడగ జంగాలు (0.5%), మాల సాలే (0.5%), మహార్ (0.2%) తదితర కులాలు వరుస స్థానాల్లో ఉన్నాయి. మాదిగ జనాభా మాలల కంటే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ. జనాభా ప్రాతిపదికన తమకు దక్కాల్సిన రాజకీయ ప్రాధాన్యత, ప్రభుత్వ ఫలాల విషయంలో మాదిగ సామాజిక వర్గం ఇకపై మరింత గట్టిగా గళం ఎత్తే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
SC కులాలలో అత్యధిక జనాభా కలిగిన టాప్ 10 కులాలు
1. మడిగ (Madiga) – 36,57,551 (10.3%)
2. మాల (Mala) – 14,71,514 (4.1%)
3. బెడ బుడగ జంగాలు (Beda/Budga Jangam) – 1,90,120 (0.5%)
4. మాల సాలే (Mala Sale) – 1,70,254 (0.5%)
5. మహార్ (Mahar) – 58,822 (0.2%)
6. మాదాసి (Madasi Kuruva) – 53,367 (0.2%)
7. మాల దాసరి (Mala Dasari) – 47,690 (0.1%)
8. మాల దాసు (Mala Dasu) – 18,076 (0.1%)
9. మంగ (Mang) – 18,830 (0.1%)
10. జాంబువులు (Jambuvulu) – 19,526 (0.1%)






