బీసీల్లో ‘ముదిరాజ్’లదే అగ్రస్థానం.. 26 లక్షల జనాభాతో మొదటి స్థానం

by Malleboina Mahesh |   (  Updated:2026-04-16 04:12:26  IST  )

బీసీ కులాల్లో ముదిరాజులే టాప్! 26.3 లక్షల జనాభాతో అగ్రస్థానంలో ముదిరాజ్ సామాజిక వర్గం. SEEEPC సర్వే-2024 గణాంకాలు వెల్లడి.

బీసీల్లో ‘ముదిరాజ్’లదే అగ్రస్థానం.. 26 లక్షల జనాభాతో మొదటి స్థానం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోని వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన SEEEPC సర్వే-2024 సంచలన గణాంకాలను వెల్లడించింది. ఈ డేటా ప్రకారం.. రాష్ట్రంలోని బీసీ కులాలన్నింటిలోనూ ముదిరాజ్ సామాజిక వర్గం అత్యధిక జనాభాతో ప్రథమ స్థానంలో నిలిచింది. సర్వే నివేదిక ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్ కులస్థుల జనాభా 26,39,027 గా నమోదైంది. మొత్తం జనాభాలో వీరి వాటా 7.4 శాతంగా ఉండటం విశేషం. బీసీ జనాభాలో ఈ కులమే అత్యంత భారీ సంఖ్యను కలిగి ఉండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

జనాభా పరంగా ముదిరాజుల తర్వాత స్థానాల్లో యాదవ, గౌడ్ సామాజిక వర్గాలు నిలిచాయి. యాదవ/గొల్ల కులస్థుల జనాభా 20.18 లక్షలతో (5.7%) రెండో స్థానంలో ఉండగా, గౌడ్ సామాజిక వర్గం 16.30 లక్షలతో (4.6%) మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో మున్నూరు కాపు (3.9%), పద్మశాలి (3.3%) సామాజిక వర్గాలు ఉన్నాయి. టాప్ 20 జాబితాలో రజక, కురుమ, వడ్డెర, అగ్నికుల క్షత్రియ వంటి కులాలు కూడా గణనీయమైన జనాభాతో నిలిచాయి. ఈ అధికారిక గణాంకాలు భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయ, సామాజిక సమీకరణాలను శాసించే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బీసీ కులాలలో టాప్ 20

1. ముదిరాజ్ (Mudiraj) – 26,39,027 (7.4%)

2. యాదవ / గొల్ల (Yadava/Golla) – 20,18,725 (5.7%)

3. గౌడ్ (Goud) – 16,30,187 (4.6%)

4. మున్నూరు కాపు (Munnuru Kapu) – 13,75,018 (3.9%)

5. పద్మశాలి (Padmashali) – 11,82,252 (3.3%)

6. రజక (Rajaka) – 9,95,972 (2.8%)

7. కురుమ / కురుబ (Kuruma/Kuruba) – 7,95,822 (2.2%)

8. ఒడ్డు / వడ్డెర (Odde/Vaddera) – 6,43,571 (1.8%)

9. అగ్నికుల క్షత్రియ (Agnikulakshatriya) – 5,27,119 (1.5%)

10. నాయి బ్రాహ్మణ్ (Nayi Brahmin) – 4,33,785 (1.2%)

11. కుమ్మర (Kummara) – 4,31,363 (1.2%)

12. వడ్రంగి (Vadrangi) – 4,07,927 (1.1%)

13. వాల్మీకి / బోయ (Valmiki/Boya) – 3,59,230 (1.0%)

14. దుదేకుల (Dudekula) – 2,69,699 (0.8%)

15. పెరిక (Perika) – 2,30,851 (0.6%)

16. బ్లాక్స్మిత్ (Blacksmith) – 1,65,726 (0.5%)

17. మేదరి (Medari) – 77,645 (0.2%)

18. గంగి రెద్దుల వారు (Gangiredlavaru) – 92,430 (0.3%)

19. గోల్డ్‌స్మిత్.. (Goldsmith) – 2,48,965 (0.7%)

20. ఉప్పర (Uppara) – 1,24,148 (0.3%)

తెలంగాణ ఎస్సీ జనాభాలో మాదిగలదే సింహభాగం.. 36.5 లక్షల జనాభాతో నంబర్ వన్

Next Story