ఉద్యోగులకు లగ్జరీ కార్లు బహుమతి.. మాకూ అలాంటి బాస్ కావాలంటున్న నెటిజన్స్

by Muthe.Rajitha |

తమ కంపెనీ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులకు లగ్జరీ కార్లను గిఫ్టుగా ఇవ్వడం సంచలనం సృష్టించింది.

ఉద్యోగులకు లగ్జరీ కార్లు బహుమతి.. మాకూ అలాంటి బాస్ కావాలంటున్న నెటిజన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ కంపెనీ బాస్ తన ఉద్యోగులకు లగ్జరీ కార్లను గిఫ్టుగా ఇచ్చాడు. ఏకంగా రూ.20 కోట్ల విలువైన కార్లు బహుమతులుగా పొందడంతో ఆ ఉద్యోగులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. తమకు కూడా అలాంటి బాస్ ఉంటే బాగుండు అని నెటిజన్స్ జలసీ ఫీల్ అవుతున్నారు. కేరళలోని కోజికోడ్‌(కలికట్) కేంద్రంగా పనిచేస్తున్న HiLITE Group తన 30వ వార్షికోత్సవాన్ని ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంది. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులకు ఇచ్చిన బహుమతులు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. సంస్థ చైర్మన్ పి. సులైమాన్, CEO అజిల్ మహమ్మద్ స్వయంగా 47 మంది సీనియర్ ఉద్యోగులకు మొత్తం రూ.20 కోట్ల విలువైన 47 కార్లు బహుమతిగా అందించారు. సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వారికి కృతజ్ఞతగా ఈ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ కార్లలో రేంజ్ రోవర్, ఆడి Q8, ల్యాండ్ రోవర్ డిఫెండర్ వంటి టాప్ ఎండ్ కార్లతో పాటు టాటా హారియర్, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, స్కోడా కైలాక్ వంటి మిడ్ రేంజ్ కార్లు కూడా ఉన్నాయి. ఉద్యోగుల దీర్ఘకాల సేవను గుర్తించి ఇలా గౌరవించడం కార్పొరేట్ ప్రపంచంలో అరుదైన, కాస్ట్లీ గిఫ్ట్ గా నిలిచింది. అంతేకాదు ఇదే వేడుకలో HiLITE Group 2030 నాటికి కేరళలో 50 మిలియన్ స్క్వేర్ ఫీట్ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. ఐటీ పార్కులు, కమర్షియల్ హబ్‌లు, ఇంటిగ్రేటెడ్ అర్బన్ ప్రాజెక్ట్‌ల ద్వారా భారీ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్‌ల ద్వారా రెండు లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు సృష్టించే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ఈ కార్యక్రమం కాస్త వార్తల్లో వైరల్ కావడంతో.. మాక్కూడా ఇలాంటి ఉద్యోగం కావాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story