- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూపీ సంస్కృతికి అద్దం పట్టేలా.. లక్నో సూపర్ జెయింట్స్ కొత్త లోగో, జెర్సీ ఆవిష్కరణ!
లక్నో సూపర్ జెయింట్స్ కొత్త జెర్సీలో జటాయువు, ఐరావతం చిహ్నాలు ఆకట్టుకుంటున్నాయి. యూపీ సంస్కృతిని ప్రతిబింబిస్తూ రూపొందించిన ఈ కిట్‌పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 కోసం లక్నో జట్టు భారీ మార్పులు చేసింది. జట్టులోని ప్లేయర్లతో పాటు జెర్సీలోనూ యాజమాన్యం కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా యూపీ సంస్కృతికి అద్దం పట్టేలా.. లక్నో సూపర్ జెయింట్స్ కొత్త లోగో, జెర్సీ ఆవిష్కరణ పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. శనివారం ఐపీఎల్ 2026 సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తమ సరికొత్త జెర్సీని, లోగోను ఆవిష్కరించింది. ఈ కొత్త డిజైన్‌లో ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా గరుడ (జటాయువు), కిరీటం, ఏనుగు (ఐరావతం) వంటి శక్తివంతమైన చిహ్నాలను పొందుపరిచారు. గరుడ పక్షి సాహసానికి , ఎత్తుకు ఎదగాలనే ఆశయానికి నిదర్శనమైతే, ఐరావతం (ఏనుగు) బలానికి, సహనానికి, ఐక్యతకు సంకేతంగా నిలుస్తుందని ఫ్రాంచైజీ యాజమాన్యం పేర్కొంది.
ఈ పురాణ చిహ్నాల కలయిక జట్టుకు కొత్త శక్తిని ఇస్తుందని క్రికెట్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కొత్త జెర్సీలో రంగుల ఎంపికపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముదురు ఎరుపు (bold red) బేస్, నేవీ బ్లూ గీతలతో రూపొందించిన ఈ కిట్, మొహున్ బగాన్ ఫుట్‌బాల్ క్లబ్ జెర్సీని పోలి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంప్రదాయ చిహ్నాలను ఆధునిక డిజైన్‌తో మిళితం చేయడం ద్వారా లక్నో జట్టు తన మూలాలను గౌరవిస్తూనే, మైదానంలో దూకుడుగా ఆడేందుకు సిద్ధమని చాటిచెప్పింది. రిషబ్ పంత్ సారథ్యంలో ఈ కొత్త రంగుల జెర్సీతో బరిలోకి దిగుతున్న లక్నో జట్టు, ఈ సీజన్‌లో టైటిల్ లక్ష్యంగా తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.






