భర్త లేని సమయంలో ఇంటికొచ్చిన ప్రియుడు.. సడెన్‌గా బెడ్‌పై మృతి

by Disha Web |
భర్త లేని సమయంలో ఇంటికొచ్చిన ప్రియుడు.. సడెన్‌గా బెడ్‌పై మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఆమె వయస్సు 28, అతని వయస్సు 40 సంవత్సరాలు. ఆమె భర్త లేనప్పుడు ఇంట్లోకి వెళ్లి ఏకాంతంగా గడిపి వచ్చేవాడు. తాజాగా ఇలాగే వెళ్లిన అతడు సడెన్ గా బెడ్ పైనే మృతిచెందాడు. మొదటగా అతడిది సాధారణ మరణమని నమ్మబలికింది. పోలీసులకు అనుమానమొచ్చి విచారించగా అసలు విషయం చెప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని సత్న జిల్లాకు చెందిన ఓ మహిళ వయస్సు 28. ఆమెకు వివాహమైంది. ఆమె భర్త లారీ డ్రైవర్. అయితే, ఆమె భర్తతోపాటు పనిచేసే 40 ఏళ్ల వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో భర్త లేని సమయంలో ఇంట్లోకి వెళ్లి ఆమెతో ఏకాంతంగా గడిపి వచ్చేవాడు. ఇలా తాజాగా కూడా అతను ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి అతను మృతిచెందాడు. అనంతరం ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్త స్నేహితుడు తమ ఇంట్లో చనిపోయాడని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు అనుమానమొచ్చింది. మరోవైపు పోస్టుమార్టమ్ రిపోర్టులో కూడా అతను ఊపిరి ఆడక చనిపోయాడని తేలింది. దీంతో ఆమెను పోలీసులు తమదైన స్టైల్ లో విచారించారు. దీంతో ఆమె అసలు విషయం చెప్పింది. మృతుడితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని... తన నుంచి డబ్బులు తీసుకునేవాడని, అదేవిధంగా బలవంతంగా శృంగారం చేసేవాడని చెప్పింది. ఈ క్రమంలోనే అతడిని వదిలించుకోవాలనే అతడి ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు తెలిపింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.


Next Story

Most Viewed