- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీలకర్ర-బెల్లం పెట్టిన వేళ ట్విస్ట్.. పెళ్లి పీటల మీద నుంచి లేచి ప్రియుడి పక్కన నిల్చున్న వధువు!
మైలవరంలో విచిత్రం! జీలకర్ర-బెల్లం పెట్టాక ప్రియుడి కోసం పెళ్లి పీటల నుండి లేచిన వధువు. "వచ్చావా" అంటూ ప్రియుడి చేయి పట్టుకోవడంతో ఆగిపోయిన పెళ్లి.

దిశ, వెబ్ డెస్క్: జీలకర్ర-బెల్లం పెట్టిన కొద్ది సేపటికే వధువు ఇచ్చిన ట్విస్ట్‌కి కుటుంబ సభ్యులతో పాటు.. పెళ్లికి వచ్చిన బందువులు షాక్ అయ్యారు. జీలకర్ర-బెల్లం పెట్టిన కొద్ది సేపటికే పెళ్లి పీటల మీద నుంచి లేచిన వధువు ప్రియుడి పక్కన నిల్చుంది. దీంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొనడం తో పాటు పీటల మీద పెళ్లి ఆగిపోయింది. ఈ అనూహ్య ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బంధుమిత్రుల కోలాహలం, మంగళవాయిద్యాల మధ్య పెళ్లి వేడుక జరుగుతుండగా, వధూవరులు ఒకరి తలపై ఒకరు జీలకర్ర-బెల్లం పెట్టుకున్నారు. ఇక మరికొద్ది నిమిషాల్లో వరుడు వధువు మెడలో తాళి కడతాడనగా, ఊహించని విధంగా వధువు ప్రియుడు పెళ్లి మండపం వద్దకు చేరుకున్నాడు. అతడిని చూడగానే వధువు ఒక్కసారిగా పీటల మీద నుంచి లేచి, "వచ్చావా" అంటూ అందరి ముందే అతని పక్కన వెళ్లి నిలబడటంతో అక్కడి వారంతా అవాక్కయ్యారు.
"ఇతను మా ఊరి అబ్బాయి.. మేము ఇద్దరం ప్రేమించుకున్నాం" అని వధువు తెగేసి చెప్పడంతో పెళ్లి హాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పెళ్లిని మధ్యలో చెడగొట్టారని ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు వధువు ప్రియుడిపై దాడికి దిగారు. ఇరువర్గాల మధ్య గొడవ ముదరడంతో సమాచారం అందుకున్న మైలవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, వధువు తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో పెళ్లి నిలిచిపోయింది. శనివారం ఉదయం ఇరు కుటుంబాల వారు, గ్రామ పెద్దల సమక్షంలో ఈ విషయంపై పంచాయితీ నిర్వహించినట్లు తెలుస్తోంది.






