- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమా థియేటర్లలో దోపిడీ: దాసోజు శ్రవణ్
కంచె చేను మేసినట్టుగా.. సీఎం, కొందరు ప్రభుత్వం పెద్దలు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కంచె చేను మేసినట్టుగా.. సీఎం, కొందరు ప్రభుత్వం పెద్దలు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమపై జులుం చేస్తూ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని.. ప్రతి దాంట్లోనూ కమీషన్లు దండుకోవడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. 1955 సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం ప్రదర్శనలు కలెక్టర్ పరిధిలో ఉంటాయని తెలిపారు. నచ్చిన వారికి నజరానా, నచ్చని వారికి జరిమానా అనేది ఈ ప్రభుత్వ వైఖరిగా ఉన్నదని పేర్కొన్నారు. ఒక్కో సినిమాకు ఒక్కో డిపార్ట్మెంట్ నుంచి జీవోలు విడుదల చేస్తున్నారని అన్నారు.
కూరగాయల షాప్ నడుపుతున్నదా?
సినిమాటోగ్రఫీ నుంచి కాకుండా హోం శాఖ నుంచి టిక్కెట్ల ధరల పెంపు జీవోలు వస్తున్నాయని.. సీఎంఓ ఒత్తిళ్లతోనే ఈ జీవోలు బయటకు వస్తున్నాయని ఆరోపించారు. తమ నేత హరీశ్‌రావు ఇదే విషయంపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ప్రశ్నించారని.. హరీశ్‌రావు ఇదే విషయమై ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు మాటల దాడులు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో పాలన ఎలా నడుస్తున్నదో దీన్ని బట్టి అర్థమవుతున్నదని.. రాష్ట్రంలో ప్రభుత్వం కూరగాయల షాప్ నడుపుతున్నదా? పాలన చేస్తున్నదా? అని ప్రశ్నించారు. సినీ హీరో ప్రభాస్ పెద్దమ్మ మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అంటే రాజా సాబ్ సినిమాపై కక్ష గట్టారని.. జీవో ఇచ్చినట్టే ఇచ్చి హైకోర్టు స్టే ఇచ్చేట్టు చేశారని ఆరోపించారు. సినిమా థియేటర్లలో దోపిడీ జరుగుతుంటే సీఎం, మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.






