Lokesh Kanagaraj: బాలీవుడ్ అగ్ర హీరోతో జతకట్టనున్న లోకేష్ కనగరాజ్.. ఇక రికార్డు బద్దలవ్వాల్సిందేనా?

by Kodari Anjali |

అత్యంత తక్కువ సమయంలో అగ్ర దర్శకుల జాబితాలో స్థానం దక్కించుకున్నాడు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj).

Lokesh Kanagaraj: బాలీవుడ్ అగ్ర హీరోతో జతకట్టనున్న లోకేష్ కనగరాజ్.. ఇక రికార్డు బద్దలవ్వాల్సిందేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యంత తక్కువ సమయంలో అగ్ర దర్శకుల జాబితాలో స్థానం దక్కించుకున్నాడు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj). లోకేశ్ పేరు వినగానే మంచి కంటెంట్‌తో పాటు హీరోలకు ఇచ్చే ఎలివేషన్ అందరికీ గుర్తొస్తుంది. లియో, విక్రమ్, ఖైదీ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి.. ప్రశంసలు అందుకున్నాడు. ప్రజెంట్ సూపర్ స్టార్ రజనీకాంత్‌(Superstar Rajinikanth)తో కూలీ మూవీ తీస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక.. ఈ దర్శకుడు బాలీవుడ్ స్టార్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌(Aamir Khan)తో జతకట్టబోతున్నాడని నెట్టింట గట్టి టాక్ వినిపిస్తుంది.

మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) లోకేశ్ అండ్ అమీర్ ఖాన్ కలయికలో వచ్చే సినిమాను భారీ బడ్జెట్‌తో చేయబోతున్నాట్లు సమాచారం. ఒకవేళ ఇదే వార్త వాస్తవమైతే మాత్రం తప్పకుండా రూ. 2 వేల కోట్ల కలెక్షన్లు రావడం పక్కా అంటూ అభిమానులు ఇప్పటినుంచే అంచనా వేస్తున్నారు. 2026 లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని జనాలు చర్చించుకుంటున్నారు. లోకేశ్ కనగరాజ్, అమీర్ ఖాన్ మూవీ అంటే ఇక బాక్సాఫీసు బద్దలవ్వాల్సిందేనంటున్నారు ఫ్యాన్స్. ప్రజెంట్ అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్(Sitare Zameen Par) చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం బాక్సాఫీసులో సందడి చేయనుంది.

Next Story