- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని మోడీపై దాడికి కుట్ర.. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సంచలన వ్యాఖ్యలు
లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో ప్రధాని మోడీపై విపక్ష ఎంపీలు దాడికి ప్రయత్నించారని ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా(Lok Sabha Speaker Om Birla) సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో ప్రధాని మోడీపై విపక్ష ఎంపీలు దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. అందుకే మోడీని స్వయంగా నేనే సభలోకి ఇప్పుడే రావొద్దని చెప్పానని అన్నారు. పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ ఇలా జరుగలేదని తెలిపారు. విపక్ష ఎంపీలు సభా మర్యాదలు ఉల్లంఘించారని అన్నారు. ముఖ్యంగా మహిళా ఎంపీల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. సభలో ప్రధాని మోడీని చుట్టుముట్టి దాడి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచించినట్లు తమకు పక్కా సమాచారం అందిందని లోక్‌సభ వర్గాలు వెల్లడించాయి. ఈ ముందస్తు సమాచారం అందడంతోనే, భద్రతా కారణాల దృష్ట్యా స్పీకర్ నిన్న సభను అర్థాంతరంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి తీర్మానాలపై ప్రధాని సమాధానం చెప్పడం ఆనవాయితీ అయినప్పటికీ, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ప్రధాని ప్రసంగం లేకుండానే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. ఈ పరిణామం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.
లోక్‌సభ వాయిదా
సభలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా లోక్‌సభను స్పీకర్ ఓంబిర్లా వాయిదా వేశారు. విపక్షాల నిరసనల మధ్య శుక్రవారానికి వాయిదా వేశారు.
మరోవైపు విపక్ష మహిళా ఎంపీలు బుధవారం లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీతోసహా అధికార పక్ష ఎంపీల సీట్లను అడ్డుగా నిలుచోవడంతో సభలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడవలసి ఉన్న ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది. 8 మంది విపక్ష ఎంపీలను మంగళవారం సస్పెండ్ చేయడం, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేకి చెందిన అముద్రిత పుస్తకం నుంచి చైనాకు సంబంధించిన కొన్ని అంశాలను ఉటంకించడానికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌సహా విపక్ష పార్టీల ఎంపీలు బుధవారం లోక్‌సభలో అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో వాయిదా వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.






