- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవర్ ప్లాంట్‌లో మద్యం దందా..!
విద్యుత్ పవర్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తిని పెంచి అందరికి అందుబాటులో కరెంట్ అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

దామెరచర్ల మండలంలోని వైటీపీఎస్‌లో బీహార్, రాజస్థాన్, అస్సాం, గుజరాత్ తో పాటుగా స్థానికంగా ఉన్న వాళ్లు సుమారు 5వేల మంది కార్మికులు పవర్ ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మంది మద్యం తాగే అలవాటు ఉన్న వాళ్లే అధికంగా ఉంటారు. వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని ప్లాంటులోనే మద్యం వ్యాపారం చేస్తున్నారని చర్చ జరుగుతుంది. అయితే ఆ పరిసరాల్లో ఉన్న బెల్ట్ షాపులలో ఒక షాపు నుంచి రెగ్యులర్ మద్యం అక్రమంగా ప్లాంట్ లోకి సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. ఫుల్ బాటిల్స్ కాకుండా కేవలం క్వార్టర్ సీసాల ద్వారా మద్యం ప్లాంట్‌లోకి వెళుతుంది. పెద్ద బాటిల్స్ అయితే తీసుకుపోవడం కష్టంగా ఉంటుందని, అంతేగాకుండా అందులో పనిచేసే కార్మికులు మద్యం కొనుగోలు చేయడం కష్టమని చిన్న బాటిల్స్ తీసుకెళ్తున్నట్లు సమాచారం. వాస్తవంగా ప్లాంట్ బయట ఉన్న బెల్ట్ షాపులలో క్వార్టర్ బాటిల్ కు ఎం ఆర్పీ ధర కంటే అదనంగా రూ. 20 పెంచి విక్రయిస్తుంటారు. కానీ పవర్ ప్లాంట్‌లో అదే క్వార్టర్ సీసాకు ఎం ఆర్పీ ధర కంటే రూ.40 పెంచి విక్రయాలు చేస్తున్నారని వినికిడి.
దిశ, నల్లగొండ బ్యూరో: విద్యుత్ పవర్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తిని పెంచి అందరికి అందుబాటులో కరెంట్ అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే గత ప్రభుత్వం ఆధ్వర్యంలో 4వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును దామరచర్ల మండలం వీర్లపాలెం, తాళ్ల వీరప్ప గూడెం గ్రామాలలో ఏర్పాటు చేశారు. కానీ అక్కడ విద్యుత్ ఉత్పదనకు బదులుగా మద్యం ఏరులై పారులై పారుతుంది. ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించి విక్రయిస్తున్నారు. కొంత మంది వ్యక్తులు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మద్యం వ్యాపారానికి అడ్డంగా మార్చారని సమాచారం.
పవర్ ప్లాంటులో మద్యం సరఫరా..
యాదాద్రి విద్యుత్ థర్మల్ పవర్ ప్రాజెక్టు సమీపంలో బీహార్, రాజస్థాన్, అస్సాం, గుజరాత్ తో పాటుగా స్థానికంగా ఉన్న వాళ్లు సుమారు 5వేల మంది కార్మికులు పవర్ ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. అదే క్రమంలో పవర్ ప్లాంట్ సమీపంలో సుమారు 10 బెల్టు షాపులు ఉన్నాయి. సహజంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మంది మద్యం అలవాటు ఉన్న వాళ్లే అధికంగా ఉంటారు. వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని ప్లాంటులోనే మద్యం వ్యాపారం చేస్తున్నారని చర్చ జరుగుతుంది. అయితే ఆ పరిసరాల్లో ఉన్న బెల్ట్ షాపులలో ఒక షాపు నుంచి రెగ్యులర్ మద్యం అక్రమంగా ప్లాంట్ లోకి సరఫరా అవుతున్నట్లు తెలుస్తుంది. ఫుల్ బాటిల్స్ కాకుండా కేవలం క్వార్టర్ సీసాల ద్వారా మద్యం ప్లాంటులోకి వెళుతుంది. పెద్ద బాటిల్స్ అయితే తీసుకుపోవడం కష్టంగా ఉంటుందని, అంతేగాకుండా అందులో పనిచేసే కార్మికులు మద్యం కొనుగోలు చేయడం కష్టమని చిన్న బాటిల్స్ తీసుకెళ్తున్నట్లు సమాచారం.
వాస్తవంగా ప్లాంట్ బయట ఉన్న బెల్ట్ షాపులలో క్వార్టర్ బాటిల్ కు ఎంఆర్పీ ధర కంటే అదనంగా రూ. 20 పెంచి విక్రయిస్తుంటారు. కానీ పవర్ ప్లాంటులో అదే క్వార్టర్ సీసాకు ఎం ఆర్ పి ధర కంటే రూ.40 పెంచి విక్రయాలు చేస్తున్నారని వినికిడి. రోజుకు దాదాపు 50 కాటన్లకు పైగా మద్యం వరకు విక్రయిస్తారని సమాచారం. కొద్దిరోజుల క్రితం పవర్ ప్లాంట్ లో మద్యం విక్రయిస్తుంటే పట్టుబడ్డ విషయం కూడా అందరికీ తెలిసిందే. మద్యం అమ్ముతున్న వ్యక్తిని పై అధికారుల పేరు చెప్పి ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలి పెట్టినట్లు సమాచారం. దీనివల్ల పెద్ద ఎత్తున అక్రమ సంపాదన వస్తున్నట్లు తెలుస్తుంది.
కీలకంగా ఆ ఇద్దరే..
విద్యుత్ పవర్ ప్లాంటులో మద్యం సరఫరా చేయడంలో ఓ అధికారి చాలా కీలక సూత్రధారి అని తెలుస్తోంది. ఆ అధికారికి అనుచరుడిగా ఉన్న ఓ ప్రైవేటు వ్యక్తి పాత్రధారిగా వ్యవహరిస్తున్నారని వినికిడి. పవర్ ప్లాంట్ లోకి వెళ్ళడానికి , బయటికి రావడానికి గేటు పాసులు ఇచ్చే స్థానంలో వారే ఉన్నందున మద్యం సరఫరా చేయడానికి ఎలాంటి అడ్డు అదుపు లేకుండా పోయిందని సమాచారం. ఇదిలా ఉంటే ఆ ప్రైవేటు వ్యక్తి తాను ఏర్పాటు చేసుకున్న కోటరి ద్వారా మద్యం లోపలికి పంపిస్తారని ప్రచారం జరుగుతోంది. అక్రమంగా మద్యం అమ్మకాలతో ప్రతినెలకు వేల రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ అక్రమ దందాను అడ్డుకునే సాహసం ఎవరు చేయడం లేదు.






