ఏపీలో ఘోరం.. భర్తను చంపి ప్రియుడితో పారిపోయిన భార్య

by Ajay Maddhiboyina |

ఏపీలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో ఓ భార్య భ‌ర్త‌ను గుడికి తీసుకువెళ్లి హ‌త్య చేసింది. అనంత‌రం ప్రియుడితో క‌లిసి అక్క‌డ నుండి పారిపోయింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఈ ఘ‌ట‌న చిత్తూరు జిల్లా గుడుప‌ల్లె మండ‌లంలోని మ‌ల్ల‌ప్ప కొండ‌పై మంగ‌ళ‌వారం చోటు చేసుకుంది.

ఏపీలో ఘోరం.. భర్తను చంపి ప్రియుడితో పారిపోయిన భార్య
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో ఓ భార్య భ‌ర్త‌ను గుడికి తీసుకువెళ్లి హ‌త్య చేసింది. అనంత‌రం ప్రియుడితో క‌లిసి అక్క‌డ నుండి పారిపోయింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఈ ఘ‌ట‌న చిత్తూరు జిల్లా గుడుప‌ల్లె మండ‌లంలోని మ‌ల్ల‌ప్ప కొండ‌పై మంగ‌ళ‌వారం చోటు చేసుకుంది. శాంతిపురం మండ‌లం బోయ‌న‌ప‌ల్లికి చెందిన ఓ మ‌హిళ‌తో రెండేళ్ల క్రితం త‌మిళ‌నాడు సూళ‌గిరి ప్రాంతానికి చెందిన ర‌మేష్ కు వివాహం జ‌రిగింది. వీరికి ప్ర‌స్తుతం ఏడాది వ‌య‌సు ఉన్న ఓ పాప ఉంది. ర‌మేష్ భార్య వారం రోజుల క్రితం త‌మిళ‌నాడు నుండి పుట్టింటికి బోయన‌ప‌ల్లికి వ‌చ్చింది.

కాగా త‌న భార్య‌, బిడ్డ‌ను చూసేందుకు మంగ‌ళ‌వారం ర‌మేష్ అత్తారింటికి వ‌చ్చాడు. త‌ర‌వాత భార్య, బిడ్డ‌తో క‌లిసి బైక్ పై ర‌మేష్ గుడుప‌ల్లె మండ‌లం మ‌ల్ల‌ప్ప కొండ‌పై ఉన్న మ‌ల్లేశ్వ‌ర స్వామి ఆల‌యానికి ద‌ర్శానికి వెళ్లారు. దేవుడి ద‌ర్శనం చేసుకుని కొండ దిగుతున్న స‌మ‌యంలో మూడో క్రాస్ వ‌ద్ద ర‌మేష్ ను గుర్తు తెలియ‌ని వ్యక్తులు దారుణంగా హ‌త్య చేశారు. ర‌మేష్ హ‌త్య త‌ర‌వాత భార్య‌, చిన్నారి క‌నిపించ‌కుండా పోయారు.

ఘ‌ట‌న‌పై స‌మాచారం అందిన పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని విచార‌ణ మొద‌లుపెట్టారు. భార్య‌, చిన్నారి మిస్ అవ్వ‌డంతో మొద‌ట అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకుని విచారించారు. ఈ నేప‌థ్యంలో సీసీటీవీ ఫుటేజ్ ప‌రిశీలించ‌గా ర‌మేష్ భార్య త‌న ప్రియుడితో క‌లిసి బైక్ పై ప‌రార్ అవుతున్న దృశ్యాలు క‌నిపించాయి. బైక్ పై మ‌హిళ‌తో పాటు మ‌రో ఇద్ద‌రు యువ‌కుల‌ను పోలీసులు గుర్తించారు. ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుగుతున్నట్టు తెలిపారు.

Next Story